మీకోసం – నాని సినిమాపై నాలుగు అప్ డేట్స్

Natural Star Nani New Movie Updates

0
93

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. సహజ నటన ఆయన సొంతం. సీన్ ఇలా చెప్పగానే అలా చేయడంలో నానిని మించిన వారు లేరు అంటారు దర్శకులు. ఇక ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ ఏర్పాటు చేసుకున్నారు నాని. ముఖ్యంగా యూత్ కు క్రేజ్ ఉన్న సినిమాలు చేస్తూ డిఫరెంట్ జోనర్ లో కూడా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు నాని.

సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి తన అభిరుచి మేర సినిమాలు నిర్మిస్తున్నాడు. ఓ పక్క హీరోగా మరో పక్క నిర్మాతగా సక్సస్ అవుతున్నారు. నాని నిర్మిస్తున్న తాజా చిత్రం మీట్ క్యూట్. నాని సోదరి దీప్తి ఘంటా ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో ఓ కథానాయికగా కాజల్ అగర్వాల్ నటిస్తోందట. ఈ సినిమాలో పాత్రకి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.నివేదా థామస్, ఆదాశర్మ పేర్లు వినిపిస్తున్నాయి, చూడాలి ఇందులో ఎవరు నటిస్తారో. ఇక ముఖ్య పాత్రలో సత్యరాజ్ నటించనున్నారట.