ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను, వైస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను నియమించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇటీవలే టిమ్ పైన్ సారథిగా తప్పుకున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. మాజీ సారథి టిమ్ పైన్..తోటి సహోద్యోగురాలికి అసభ్యకరంగా టెక్స్ట్ చేసిన కారణంగా అతడిని కెప్టెన్ గా తొలగించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాట్ కమిన్స్ ఓ అద్భుతమైన ఆటగాడు. మంచి నాయకుడు. జట్టు సభ్యుల నుంచి క్రికెట్ అభిమానుల నుంచి ఎంతో ప్రేమను సంపాదించాడు. ఎన్నో ఘనతలు సాధించాడు. ఆసీస్ జట్టు సీనియర్ ఆటగాళ్లలో అనుభవంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉండటం చాలా గొప్ప విషయం అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ పేర్కొన్నాడు.
టెస్టు కెప్టెన్ బాధ్యతలు తనకు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశాడు పాట్ కమిన్స్. టిమ్ పైన్ గత కొన్నేళ్లుగా జట్టుకు సేవలందించిన విధంగానే ఆసీస్‌ను ముందుకు నడిపిస్తానని పేర్కొన్నాడు. మరోవైపు స్టీవ్ స్మిత్.. వైస్ కెప్టెన్‌గా సేవలందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్ త్వరలోనే ప్రారంభం కానుంది. డిసెంబర్ 8న గబ్బా వేదికగా తొలి టెస్టు జరగనుంది.