మ‌రో డైరెక్ట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నున్న తార‌క్

Uppena Director Buchi babu new movie with ntr

0
94

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు తార‌క్. ఇక దీని త‌ర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో సినిమాలు ఒకే చేశారు.
ఇక వ‌చ్చే ఏడాదికి ఈ రెండు సినిమాలు కూడా పూర్తి అవుతాయి. అయితే ఇంకా మ‌రిన్ని క‌థ‌లు వింటున్నార‌ట తార‌క్. ఈ వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది.

తాజాగా తార‌క్ మ‌రో యంగ్ డైరెక్ట‌ర్ స్టోరీకి ఒకే చెప్పారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి.ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానతో ఎన్టీఆర్ డిస్కషన్స్ చేస్తున్నార‌ని, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రం తీస్తుంది అని వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఉప్పెన సినిమా త‌ర్వాతే ఈ వార్త వినిపించింది ఈలోపు మంచి క‌థ సిద్దం చేసుకుని బుచ్చిబాబు తార‌క్ ని క‌లిశారు అంటున్నారు.

ఉప్పెన సినిమాతో ఫీల్ గుడ్ సినిమాను తెలుగు వారికి అందించారు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా సూప‌ర్ ఫేమ్ సంపాదించారు. ఇక ప‌లువురు అగ్ర‌హీరోలు ఆయ‌న క‌థ‌లు వినేందుకు ఒకేచెబుతున్నారు. సో చూడాలి తార‌క్ తో ఆయ‌న సినిమా పై క్లారిటీ రావాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే.