భారత్ తో వన్డే సిరీస్​..దక్షిణాఫ్రికా జట్టు ఇదే!

ODI series with India..this is the South African team!

0
107

వెస్టర్న్ కేప్​ వేదికగా జనవరి 19 నుంచి 23 వరకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్​ జరగనుంది. ఈ నేపథ్యంలో 17 మందితో కూడిన జట్టును ​ప్రకటించింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. మార్కో జాన్సన్​కు వన్డే జట్టులో తొలి అవకాశం దక్కగా..ఎన్రిచ్ నోర్జేకు చోటు దక్కలేదు. తొడ కండరాల గాయం నుంచి కోలుకోని కారణంగా నోర్జేకు విశ్రాంతి ఇచ్చింది సీఎస్​ఏ.

తెంబా బవుమా(కెప్టెన్), కేశవ్ మహారాజ్(వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్, జుబైర్ హంజా, మార్కో జాన్సన్, జన్నేమన్ మలన్, సిసంద మగాల, మార్​క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వాయిన్ పార్నెల్, ఆండిలే పెహ్లుక్వాయో, డ్వేన్ ప్రెటోరియస్, కగిసో రబాడ, టబ్రాయిజ్ షంసి, రస్సీ వాన్ డర్ డస్సెన్, కైల్ వెర్రైన్నే.

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్​కు ఎంపికవడంపై హర్షం వ్యక్తం చేశాడు యువ ఆటగాడు వెంకటేశ్​ అయ్యర్​. ఈ పర్యటన కోసం సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. అక్కడి పిచ్​లపై ఎలా రాణించాలనే విషయమై తన వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నట్లు చెప్పాడు.