పీవీ సిందూతో వివాహం చేయకుంటే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటా 70 ఏళ్ల వృద్దుడు

పీవీ సిందూతో వివాహం చేయకుంటే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటా 70 ఏళ్ల వృద్దుడు

0
85

ప్రపంచ బ్యాడ్మిటన్ తెలుగు తేజం పీవీ సిందుతో తనకు వివాహం జరిపించాలని ఓ 70 ఏళ్ల వృద్దుడు తాజాగా జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు అందించారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలందరు అవాక్కు అయ్యారు… ఈ వింతైన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

తాజాగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికను నిర్వహించారు ఈ కార్యక్రమానికి 70 ఏళ్ల మలైస్వామి వచ్చాడు… వస్తూనే బాడ్మిటన్ పీవీ సిందూకు తాను వీరాభిమానినని తనతో ఉన్న పీవీ సిందూ ఫోటోను చూపించారు.. ఎలాగైనా తనకు పీవీ సిందూని ఇచ్చి వివాహం చేయాలని కోరారు.

తన వయస్సు 16 సంవత్సరాలే అని తాను 2004 ఏప్రిల్ లో జన్మించానన చెప్పారు. తనకు పీవీ సిందూను ఇచ్చి వివాహం చేయకుంటే ఆమెను ఎత్తుకుపోయి అయినా సరే పెళ్లి చేసుకుంటానని తెలిపారు మలైస్వామి. ఈ క్రమంలో అతనికి సర్ది చెప్పే ప్రయత్నాలు చేసినా తనకు ఖచ్చితంగా సిందూతో వివాహం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు