100 ఏళ్ల భారత కలని నెరవేర్చిన నీరజ్ చోప్రా – రియల్ స్టోరీ

Olympics gold medallist Neeraj Chopra Real Story

0
80

100 ఏళ్ల భారత కలని నెరవేర్చిన నీరజ్ చోప్రా . ఇప్పుడు దేశం అంతా అతని పేరు వినిపిస్తోంది.
భారత జావెలిన్ థ్రో ప్లేయర్ నీరజ్ చోప్రా చరిత్రను తిరగరాశాడు. క్వాలిఫికేషన్ రౌండ్ లో అద్భుత ప్రదర్శనను కనబరిచిన నీరజ్ ఫైనల్లోనూ సత్తా చాటి బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు.
భారత్ 100 ఏళ్ల కల నేడు సాకారమైంది. అథ్లెటిక్స్ పతకం కోసం ఎదురు చూస్తోన్న భారత్ కి నేడు పడిసి పతకం అందించాడు ఈ బంగారు కొండ.

ఫురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో పోటీపడిన నీరజ్ చోప్రా 87.58 మీటర్లతో బంగారు పతకాన్ని గెలుపొందాడు. హరియాణాలోని పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997 డిసెంబర్ 24న జన్మించాడు. చంఢీఘర్లోని డీఏవీ కాలేజ్లో చదువుకున్నాడు. చిన్నతనంలో ఆర్మీకి ఎంపిక అయి ఉద్యోగం చేస్తున్నాడు. ఇక అతని తల్లిదండ్రులు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు. అత‌నికి ఇద్ద‌రు చెల్లెల్లు ఉన్నారు. చిన్న‌త‌నం నుంచి క్రీడ‌ల‌పై అత‌నికి ఆస‌క్తి ఉండేది.

నీరజ్ ఇండియన్ ఆర్మీలో నాయక్ సుబేదార్ గా పనిచేస్తున్నాడు. అతనిని దేశం అంతా శభాష్ అంటోంది. ప్రధాని నుంచి దేశ ప్రజలు అందరూ కూడా నీరజ్ ని అభినందిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ పతకాల సంఖ్య 7కి చేరింది. గత ఒలింపిక్స్ లో ఆరు పతకాలు సాధించిన భారత్ ఇప్పుడు ఏడు పతకాలను సాధించింది.