బీసీసీఐని బెదిరించిన పాక్ క్రికెట్ బోర్డు మళ్లీ మాట మార్చింది

బీసీసీఐని బెదిరించిన పాక్ క్రికెట్ బోర్డు మళ్లీ మాట మార్చింది

0
94

పాక్ అన్ని విషయాలలో భారత్ ని బెదిరిద్దాం అని భావిస్తుంది.. కాని కొన్ని ఎత్తులు మాత్రం చిత్తు అవుతాయి, ముఖ్యంగా క్రికెట్ విషయానికి వస్తే భారత్ పాక్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలుకూడా ఈ మ్యాచ్ లని ఎంతో ఆసక్తిగా చూస్తాయి, దీనికి కారణం ఈ రెండు దేశాల మధ్య వైరం ఎలా ఉందో క్రికెట్లో కూడా తమ దేశం గెలవాలి అని రెండు దేశాల ఆటగాళ్లు పోటీపడి మరీ ఆడతారు.

తాజాగా తమ గడ్డపై నిర్వహించే ఆసియా కప్ టోర్నీలో భారత్ ఆడకపోతే, భారత్ లో నిర్వహించే టి20 ప్రపంచకప్ లో తమ జట్టు ఆడదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీసీబీ బెదిరింపు స్వరం వినిపించారు, అయితే భారత్ క్రికెట్ బోర్డు కూడా దీని గురించి పెద్ద పట్టించుకోలేదు, అయితే, అంతలోనే పీసీబీ మాట మార్చింది.

పీసీబీ సీఈఓ వసీమ్ ఖాన్ స్పందిస్తూ, తాను మాట్లాడిన మాటలను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. ఆసియా కప్ ను పాకిస్థాన్ లోనే నిర్వహిస్తామని చెప్పారు ఆయన, భారత్ ఆడాల్సిన మ్యాచ్ లపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆసియా క్రికెట్ మండలి మాత్రమేనని స్పష్టం చేశారు. అంతేకాదు, 2021లో భారత గడ్డపై జరిగే టి20 వరల్డ్ కప్ ను కూడా తాము బహిష్కరించబోమని స్పష్టం చేశారు… సో ఇలా మాట మార్చారా అని నెటిజన్లు కూడా ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు.