క్రికెట్ ఆట అందరికి అభిమానమే, కులాలు మతాలకు అతీతంగా ఇష్టపడతారు. కాని క్రికెటర్లకు కూడా కొందరికి కులాలు మతాల గురింటి టాక్స్ ఉంటాయి అనేది తాజాగా తెలుస్తోంది. అవును పాక్ లో హిందూ క్రికెటర్ ని సొంత జట్టువారు ఆటపట్టించేవారట, ఈ విషయాన్ని స్వయంగా షోయబ్ అక్తర్ తెలియచేశారు. తమ జట్టులో హిందువు అయిన స్పిన్నర్ డానిష్ కనేరియాపట్ల పాకిస్థాన్ జట్టులోని కొందరు క్రికెటర్లు తీవ్ర వివక్ష చూపారని అక్తర్ ఓ పెద్ద సీక్రెట్ బయటపెట్టాడు. ఆ క్రికెటర్ కనేరియా.
అంతేకాదు కనేరియా తో కలిసి భోజనం చేసేందుకూ వారు ఇష్టం చూపించేవారు కాదట….నేను ఆడే సమయంలో జట్టులో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు ప్రాంతీయతత్వం ప్రదర్శించేవారు. ఎవరు కరాచీ, ఎవరు పంజాబీ, ఎవరు పెషావర్ అని మాట్లాడేవారు. వీరిపై నేను ఎంతో పోరాడా. పాకిస్థానీయుల గురించే అలా మాట్లాడేవారంటే ఇక జట్టులో హిందువు పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి అని అన్నారు.
అయితే కనేరియా మాకు మంచి విజయాలు అందించాడు అతనిని ప్రశంసించకుండా కులం మతంతో మాట్లాడేవారు, కనేరియా ఈ దేశంలో ఎలా జీవిస్తున్నాడు అని మా జట్టులోని ఆటగాళ్లు తప్పుపట్టేవారు అని అక్తర్ వెల్లడించాడు. అయితే ఇదంతా నిజం అని కనేరియా కూడా ఒప్పుకున్నాడు.
పాక్ కోసం 61 టెస్ట్ల్లో 261 వికెట్లు పడగొట్టిన కనేరియా ఆరోజుల్లో చాలా ఇబ్బందులు పడేవారట.