పంత్ అలా చేయడం క్షమించరానిది..రిషబ్ కు మాజీ క్రికెటర్ చురకలు

-

పంత్ అనవసర షాట్ల ఎంపికపై ఇప్పటికే రచ్చ జరిగింది. మరోసారి పంత్ షాట్ ఎంపికపై మాట్లాడుకునేలా చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ అనవసర షాట్​కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీనితో విమర్శల పాలవుతున్నాడు.

- Advertisement -

దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్.. పంత్​ ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాల్సింది పోయి భారీ షాట్​కు ప్రయత్నించి పెవిలియన్ చేయడం సరైంది కాదు. “క్రీజులో ఇద్దరూ కొత్తగా వచ్చిన బ్యాటర్లు ఉన్నపుడు (పంత్, విహారి ఆడుతుండగా) పంత్ షాట్ ఆడటం నచ్చలేదు. అది ఏ మాత్రం క్షమించరానిది. ఇది అతడి సహజ ఆటతీరు కాదు. ఈ సమయంలో కొంచెం బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. బంతి శరీరంపైకి వస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. రహానే, పుజారాను చూడండి. వాళ్లు ఎంత ఓపికతో బ్యాటింగ్ చేశారు” అని పంత్ ఔటైన తీరును తప్పుబడ్డాటు గావస్కర్.

ఇప్పటివరకు ఈ సిరీస్​లో రెండు టెస్టుల్లోనూ ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక ఈ రెండో ఇన్నింగ్స్​లో 266 పరుగులకు ఆలౌటైంది భారత్. విహారి (40*) చివర్లో ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా ముందు 240 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది టీమ్ఇండియా. రెండో ఇన్నింగ్స్​లో కేవలం మూడు బంతులాడిన పంత్ డకౌట్​గా వెనుదిరిగాడు. రబాడ వేసిన బంతిని ముందుకొచ్చి భారీ షాట్ ఆడబోయి కీపర్ చేతికి చిక్కాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...