నన్ను కూడా కిడ్నాప్ చేశారు – స్టార్ హీరోయిన్

నన్ను కూడా కిడ్నాప్ చేశారు - స్టార్ హీరోయిన్

0
105

మలయాళ హీరోయిన్ పార్వతీ మీనన్ ని కూడా కొంతమంది కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారట . ఈ విషయాన్నీ ఎవరో చెప్పడం కాదు స్వయంగా పార్వతీ మీనన్ చెబుతోంది అయితే కిడ్నాప్ , అఘాయిత్యం చేసింది ఇప్పుడు కాదని చాలా రోజులు అవుతోందని అయితే ఇప్పుడా వ్యక్తి పేరు చెప్పి శిక్షించడం పెద్ద కష్టం కాదని అయితే వాడు ఎంతకైనా తెగించే రకమని అందుకే ఆ విషయాన్నీ మర్చిపోయి బ్రతుకు వెళ్లదీస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది .

బెంగుళూర్ డేస్ , పూ చిత్రాల్లోని నటనకు గాను ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న ఈ మలయాళ భామ దక్షిణాదిన సుపరిచితురాలే ! మలయాళ చిత్ర రంగంలో హీరోయిన్ భావన ని హీరో దిలీప్ కిడ్నాప్ చేయించడమే కాకుండా ఆమె నగ్న వీడియో లను తీయడానికి కిరాయి మనుషులను పురమాయించాడని ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే .

మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు హీరో దిలీప్ దాంతో అతడి పై మలయాళ నటీనటుల సంఘం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది మొదట్లో కానీ మూడు నెలల కాలంలోనే అతడి పై వేసిన సస్పెన్షన్ ని రద్దు చేసి మళ్ళీ అసోసియేషన్ లోకి తీసుకోవడంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసారు పలువురు హీరోయిన్ లు అందులో పార్వతీ మీనన్ కూడా ఒకరు .

పార్వతీ మీనన్ ని కూడా భావన ని కిడ్నాప్ చేసినట్లుగా కిడ్నాప్ చేశారట అలాగే అఘాయిత్యానికి పాల్పడ్డారట అయితే పార్వతీ మీనన్ మాత్రం భావన లా కేసు పెట్టలేదు ఆ దుస్సంఘటన ని తలచుకొని కొద్దీ రోజులు బాధపడినప్పటికీ ఆ తర్వాత తేరుకొని మామూలు జీవితాన్ని ప్రారంభించిందట ! ఇప్పుడు కూడా అతడి పై ఆరోపణలు రుజువు చేసి శిక్ష వేయించాలని అనుకుంటోంది కానీ తర్వాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వెనకడుగు వేస్తోంది . ఎందుకంటే వాడు దుష్టుడు కాబట్టి ఎంతకైనా తెగిస్తాడు , జీవితాల్ని నాశనం చేస్తాడు కాబట్టి అని అంటోంది .