పాయల్ రాజపుట్ అందుకే రామ్ చరణ్ సినిమా రిజెక్ట్ చేసింది

పాయల్ రాజపుట్ అందుకే రామ్ చరణ్ సినిమా రిజెక్ట్ చేసింది

0
120

RX100 సినిమా తో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు అవకాశాలు బాగా వస్తున్నాయి . కానీ నిర్ణయాలు తీసుకోవడంలో కరెక్ట్ గా వ్యవహరిస్తుందా లేదా అనుమానం రాక మానదు తను వదులుకుంటున్న కమిట్మెంట్స్ చూస్తే. ఇటీవలే రామ్ చరణ్ బోయపాటి శీను మూవీకి ఐటెం సాంగ్ కోసం సంప్రదిస్తే నో చెప్పిందని వినికిడి. కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే చేయాలనీ చూస్తున్నట్టు ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట. మరోవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాజల్ జోడిగా నటిస్తున్న తేజ దర్శకత్వంలో సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు సైతం నో చెప్పిందట ఈ భామ. ఇంతే కాదండోయ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ సినిమాలో క్యామియో సైతం వద్దని చెప్పిందట. ఈ మూడూ ఆయా హీరోల రేంజ్ కు తగ్గట్టు క్రేజీ ఆఫర్లే. పాయల్ నో చెప్పడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఫిలిం నగర్ టాక్ వినిపిస్తో౦ది.

ఇక ఇప్పుడు తేలుగు పరిశ్రలో ప్రత్యేకంగా ఐటెం గర్ల్స్ అంటూ ఎవరూ లేరనే చెప్పాలి.అయితే సందర్భానికి తగ్గట్టు హీరో ఇమేజ్ ని బట్టి స్టార్ హీరొయిన్లే ఒక పాటలో డాన్స్ చేసేందుకు మొహమాటపడటం లేదు. జనతా గ్యారేజ్ లో కాజల్ అల్లుడు శీనులో తమన్నా వాళ్ళ వాళ్ళ ఇమేజ్ పీక్స్ లో ఉన్నప్పుడే చేసిన పాటలు. అవేవి నష్టం చేకూర్చలేదని మనకు తెలిసి౦దే.అయినా గాని కెరీర్ గ్రాఫ్ కూడా పడిపోలేదు. అలాంటాప్పుడు చరణ్ సినిమా ఆఫర్ ని పాజిటివ్ గా తీసుకుని ఉంటే బాగుండేది. మిగిలినవి కూడా పెద్ద బ్యానర్ల సినిమాలు. ఏదో ఒకరకంగా ఉపయోగపడేవి. సి కళ్యాణ్ నిర్మాతగా ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు తప్ప పాయల్ ఇంకేదీ సైన్ చేయలేదని తెలిసింది. తనదగ్గరకు వస్తున్న వాళ్ళు ఇందూ పాత్ర దృష్టితోనే చూస్తున్నారని ఇటీవలే బాంబు పేల్చిన పాయల్ కు స్వంత బాషా పంజాబీ నుంచి కూడా బాగానే అవకాశాలు వస్తున్నాయి. కానీ తను మాత్రం ఇక్కడ సెటిల్ అవ్వాలనే ప్లాన్ తో ఉంది.