సుదీర్ఘ కాలం నాన్చివేత తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు కొత్త పిసిిస చీఫ్ ను ఎంపిక చేసింది. దూకుడు కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న రేవంత్ రెడ్డిని పిసిిసి చీఫ్ గా ప్రకటించింది. అయితే ఈ విషయంలో సీనియర్లు ముందు నుంచీ రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ కాకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలపై అధిష్టానం నీళ్లు చల్లింది. అంతిమంగా దూకుడు తత్వం కలిగి కేసిఆర్ తో ఢీకొట్టగల నాయకుడిగా ముద్రపడిన రేవంత్ వైపు మొగ్గు చూపింది.
ఈ పరిణామాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. టిడిపి నుంచి నిన్నకాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవి ఇవ్వడం పట్ల సీనియర్లు రగిలిపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి తనకున్న టిపిసిసి ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కొత్త కార్యవర్గం కొలువుదీరేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
మర్రి శశిధర్ రెడ్డి తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ లోనే గడిపారు. జెంటిల్మన్ పొలిటీషియన్ గా పేరుతెచ్చుకున్నారు. ఆయనే కాదు ఆయన తండ్రి మర్రి చెన్నారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయం చేశారు. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే సోనియాగాంధీకి అడ్రస్ చేస్తూ రాసిన లేఖలో తాను మాత్రం తన శక్తిమేరకు పనిచేస్తూ కాంగ్రెస్ లోనే కొనసాగుతానని రాశారు.
మర్రి శశిధర్ రెడ్డి ఎన్ని వత్తిళ్లు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. వైఎస్ సిఎం గా ఉన్న రోజుల్లో దివంగత నేత పబ్బతి రెడ్డి జనార్దన్ రెడ్డి (పిజెఆర్) తో కలిసి మర్రి శశిధర్ రెడ్డి అనేక విషయాలపై వైఎస్ సర్కారుపైనే సొంతపార్టీలో ఉండి పోరాటం చేశారు. పిజెఆర్, మర్రి ని ఇద్దరిని కలిసి హైదరాబాద్ బ్రదర్స్ అని పిలిచేవారు. కొన్ని సందర్భాల్లో వైఎస్.. పిజెఆర్ ను ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆయనకు దన్నుగా నిలబడిన వ్యక్తి మర్రి శశిధర్ రెడ్డి.
నిన్న రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవిని ప్రకటించిన కొన్ని గంటల్లోనే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మేడ్చల్ లో రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు తోటకూర జంగయ్య యాదవ్ ఉన్నారు. రేపటినాడు మేడ్చల్ సీటు జంగయ్య యాదవ్ కే తప్ప తనకు రాదన్న భావనతోనే కెఎల్ఆర్ వెంటనే కాంగ్రెస్ ను వీడినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు చూస్తే మొదట కేఎల్ఆర్ ఒపెన్ గా పార్టీకి గుడ్ బై చెప్పిన పరిస్థితి ఉంటే… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీపైనా రేవంత్ పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ మర్రి శశిధర్ రెడ్డి మాత్రం తన పదవికి గుడ్ బై చెప్పారు. కొత్త కార్యవర్గం కోసమే తాను రాజీనామా చేసినట్లు లేఖలో పర్కొన్నారు. కానీ ఆయన అసంతృప్తితో ఉన్నారా లేదా అన్నది ఇంకా తేలలేదు.
మర్రి లేఖలో ఉన్న వివరణ
Respected Madam, in view of this, I am submitting my
resignation as Chairman of the TPCC Election Committee
Coordination Committee. I am doing this to give a free hand, in all
fairness, to the new PCC President Shri Revanth Reddy to
reconstitute it.
Congress party’s interest will, as always, remain at the centre
of whatever I will continue do, as a Congressman, in my individual
capacity.
With warm personal regards.
ఈ వార్త కూడా చదవండి…
రేవంత్ రెడ్డిపై కత్తి దూసిన కోమటిరెడ్డి : ఎయిర్ పోర్ట్ లో దిగగానే సీరియస్ కామెంట్స్