భార్య భర్త టెర్రస్ పై సిట్టింగ్ వేశారు – భార్యకి ఓ ఫోన్ కాల్ – అదే కొంప ముంచింది

Phone call to wife - Reason for admission to the same hospital

0
77

వికాస్ – నిక్కీ ఈ జంట మిరట్ లో ఉంటున్నారు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇటీవల నిక్కీ చాలా మందితో ఫోన్లు మాట్లాడుతోంది. అంతేకాదు వాటికి నేమ్స్ కూడా ఉండటం లేదు. దీనిపై వికాస్ ఆమెని చాలా సార్లు ప్రశ్నించాడు. అయినా ఆమె నా స్నేహితులు అని చెప్పింది. నువ్వు నన్ను అనుమానిస్తున్నావని ప్రశ్నించింది.

దీంతో వికాస్ – నిక్కీ కొద్ది రోజులుగా గొడవపడుతూనే ఉంటున్నారు, అయితే నిన్న రాత్రి ఇద్దరూ కలిసి టెర్రస్ పై సిట్టింగ్ వేశారు. ఫుల్ బాటిల్ తాగిన తర్వాత నిక్కీకి ఓ కాల్ వచ్చింది. ఆమె ఎంతో చనువుగా మాట్లాడుతూ వికాస్ కి కనిపించింది. ఇక ఫోన్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరితో మాట్టాడావు అని వికాస్ ఆమెని ప్రశ్నించాడు.

అతను నా ఫ్రెండ్ అని చెప్పింది. అయితే నీకు అతనికి అఫైర్ ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నావని ఆమెపై విమర్శలు చేశాడు. దీంతో ఆమె కూడా కోపంతో విరుచుకుపడింది. ఇక వికాస్ కోపంతో ఆమెని టెర్రస్ నుంచి కిందకి తోశాడు. దీంతో వెంటనే స్ధానికులు ఆమెని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ఆమె ప్రస్తుతం ఐసీయూలో ఉంది.