‘ప్లేయర్​ ఆఫ్ ది మంత్’​ జాబితా ప్రకటన..రేసులో ఆ​​ హిట్టర్!

'Player of the Month' list announcement..that hitter in the race!

0
88

అక్టోబర్ నెలకు సంబంధించి ‘ప్లేయర్​ ఆఫ్ ది మంత్’​ జాబితాను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది ఐసీసీ. అందులో భాగంగానే అక్టోబర్ నెల కోసం టాప్ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది.

టీ20 ప్రపంచకప్​లో భాగంగా అత్యుత్తమ బ్యాటింగ్ నైపుణ్యం కనబరిచిన పాకిస్థాన్​ ఆటగాడు అసిఫ్ అలీకి ఈ ఐసీసీ విడుదల చేసిన జాబితాలో చోటు దక్కింది. ఇతడితో పాటు బంగ్లాదేశ్ ఆల్​రౌండర్ షకిబ్ అల్ హసన్, నమీబియా ఆటగాడు డేవిడ్ వైస్​కు స్థానం లభించింది.

అలాగే మహిళా క్రికెటర్లలో ఐర్లాండ్ ఆల్​రౌండర్ లారా దిలానీ, బ్యాటర్ గాబీ లెవిస్, జింబాబ్వే కెప్టెన్, ఆల్​రౌండర్ మేరీ అన్నె ముసోండా.. ‘ప్లేయర్​ ఆఫ్​ ది మంత్’కు నామినేట్ అయ్యారు.