క్రికెట్ లో ఎన్నో సార్లు మన్కడింగ్ పలు మార్లు వివాదాలను సృష్టించింది. బౌలర్ బంతి వేసే సమయంలో నాన్ స్ట్రైకర్ ముందే క్రీజు దాటితే బౌలర్ అవుట్ చేయడాన్ని మన్కడింగ్ అంటారు. తాజాగా మన్కడింగ్ ను నిషేధిస్తూ.. క్రికెట్ రూల్స్ నుంచి తొలగిస్తున్నట్లు మెరిట్ బోర్న్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. మన్కడింగ్ క్రీడాస్ఫూర్తి విరుద్ధమని… ఇకపై మన్కడింగ్ కు ఛాన్స్ లేదని స్పష్టం చేసింది.
మరోవైపు క్యాచ్ అవుట్ సమయంలో స్ట్రైకింగ్ విషయంలో మార్పులు చేసింది. ఆటగాడు క్యాచ్ ఇచ్చినప్పుడు ఆ క్యాచ్‌ను ఫీల్డర్ అందుకునే లోపే క్రీజులో ఉన్న ఆటగాళ్లు పరుగు కోసం వెళ్లిన క్రమంలో ఒకరినొకరు దాటినట్లయితే.. క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు ఉండాలని రూల్ తీసుకొచ్చింది. గతంలో ఉన్న రూల్ ప్రకారం ఇలాంటి సమయాల్లో క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌కు వైపు ఉండేవాడు.
అలాగే బంతిని మెరిపించేందుకు బౌలర్లు సెలైవాను ఉపయోగించకూడదని కరోనా సమయంలో ఎంసీసీ తెలిపింది. తాజాగా ఎంసీసీ సలైవానను పూర్తిగా నిషేధించింది. అలాగే క్రికెట్ లో లా 22.1 ప్రకారం.. ఇకపై స్ట్రయిక్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ నిల్చున్న స్థానం నుంచి.. బంతి కొద్ది దూరంలో వెళ్లినా దానిని వైడ్ గా పరిగణించాలనే కొత్త నిబంధనను ఎంసీసీ అమలులోకి తీసుకురానుంది.