జగన్ ను కలిసిన పివి సింధు సింధు

జగన్ ను కలిసిన పివి సింధు సింధు ఐదు ఎకరాలు ఇచ్చేందుకు జగన్ అంగీకారం

0
117

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుసుకుంది తన తల్లిదండ్రులతో కలిసి అమరావతిలోని సచివాలయానికి వెళ్ళిన సింధు జగన్ ను కలిసీంది. ఈ సందర్భంగా వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించిన సింధును ముఖ్యమంత్రి జగన్ శాలువా కప్పి సత్కరించారు. ఈ మేరకు ఆమెకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలో అక్కడ మంత్రి అవంతి శ్రీనివాస్, షాప్ అధికారులు కూడా ఉన్నారు.

సమావేశం అనంతరం పీవీ సింధు తో మాట్లాడుతూ వైజాగ్ లో అకాడమీ నెలకొల్పేందుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు జగన్ అంగీకరించారని తెలి పింది. అన్ని రకాలుగా సహాయం చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించింది. పద్మభూషణ్ పురస్కారానికి తన పేరుని పరిశీలిస్తుండటం గర్వంగా ఉందని తెలిపింది. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో సింధు గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.