టీమిండియాను ఆదుకున్న రహనె

టీమిండియాను ఆదుకున్న రహనె

0
106

వెస్టిండీస్తో ఆంటిగ్వా వేదికగా గురువారం రాత్రి ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్. భారత్ని బ్యాటింగ్కి ఆహ్వానించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ జట్టుకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి.

ఓపెనర్ జోడిమీద ఆశలు పెట్టుకున్న వారి పై నిల్లు జల్లుతూ, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5:13 బంతుల్లో 1),టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా(2:4 బంతుల్లో)లను ఒకే ఓవర్లో కీమర్ రోచ్ పెవిలియన్ బాట పట్టించాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (9:12 బంతుల్లో 2్ఠ4) నిరాశపరచి గాబ్రిల్ బౌలింగ్లో దొరికిపోయాడు.దీంతో భారత్ జట్టు 7.5ఓవర్లు ముగిసే సమయానికి 25/3తో ఒత్తిడిలో పడింది.
వర్షం పదే పదే అంతరాయం కలిగించిన.ఈ సమయంలో భారత్ జట్టుకు గడ్డుపరీక్షే ఎదురైంది.ఈ దశలో క్రీజులోకి వచ్చిన అజింక్య రహానె,మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (44:97బంతుల్లో 54)తో కలిసి భారత్ జట్టుని ఆదుకున్నాడు. నాలుగో వికెట్కి ఈ జోడీ 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా,జట్టు స్కోరు 93వద్ద రాహుల్ ఔటైపోయాడు.అనంతరం వచ్చిన హనుమ విహారి (35:56 బంతుల్లో 54) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకున్నాడు.అయినప్పటకీ,పట్టుదలతో ఆడిన రహానె హాఫ్ సెంచరీతో భారత్ పరువు నిలిపాడు.

ఇక వదలని వర్షం కారణంగా 68.5 ఓవర్ల వద్దే తొలి రోజు ఆట ముగిసింది.ఈ మ్యాచ్లో భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అజింక్య రహానె (81:163 బంతుల్లో 104) హాఫ్ సెంచరీ సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 203/6తో కాస్తైన పరువు కాపాడుకుని,నిలిచింది.ఇక క్రీజులో రిషబ్ పంత్ (20 నాటౌట్: 41 బంతుల్లో 44),రవీంద్ర జడేజా (3 నాటౌట్: 28 బంతుల్లో) ఉన్నారు.వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు కీమర్ రోచ్ మూడు,గాబ్రిల్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్లో తేలిపోయిన విరాట్ కోహ్లీ, పుజారా,మయాంక్ అగర్వాల్ తమ ఆట తీరుతో అభిమానులను నిరాశ పరిచారు.