రాజస్థాన్ జట్టులో రాహుల్ తెవాటియా – రియల్ స్టోరీ

రాజస్థాన్ జట్టులో రాహుల్ తెవాటియా - రియల్ స్టోరీ

0
97

ఐపీఎల్ పరుగుల సునామీ సృష్టిస్తోంది.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది, హిట్టర్లు ఒక్కొక్కరు బయటపడుతున్నారు ఈసీజన్లో, మొన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆ తర్వాత చేజింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ పరుగుల మోత మోగించాయి.

పంజాబ్ తరఫున సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్, కెప్టెన్ కేఎల్ రాహుల్ రాణించగా, రాజస్థాన్ జట్టులో సంజు శాంసన్, రాహుల్ తెవాటియా అద్భుతంగా రాణించి విజయం వైపు తీసుకువచ్చారు, అయితే అందరూ చర్చించుకునేది ఒకరి గురించే రాహుల్ తెవాటియా, అతని ఆట ఓ చరిత్రగా మిగిలింది మొన్న.

తెవాటియా ఎడమచేతివాటం ఆటగాడు. ఏకంగా ఐదు భారీ సిక్సర్లు కొట్టి అసాధ్యమనుకున్న లక్ష్యఛేదనను సుసాధ్యం చేశాడు. 31 బంతుల్లో 53 పరుగులు చేసిన తెవాటియా ఏకంగా ఓవర్లో 5 సిక్సులు బాదాడు అతని గురించి చూస్తే అతను సాధారణ లెగ్ స్పిన్నర్ .

రాహుల్ తెవాటియా హర్యానాకు చెందిన ఆటగాడు. వయసు 27 సంవత్సరాలు. ఇప్పటివరకు తన కెరీర్ లో 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. మొత్తం190 పరుగులు చేశాడు. యావరేజ్ 17.27….మొత్తం 17 వికెట్లు తీశాడు.

2013లో దేశవాళీ క్రికెట్ లోకి వచ్చాడు, తెవాటియా గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరఫున ఐపీఎల్ లోఆడాడు, ఇప్పుడు తను మెయిన్ మ్యాచుల్లో మంచి హిట్టర్ అవుతాడు అంటున్నారు అందరూ.