2020లో జరిగిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ లో ఓ ఆటగాడు ఆడకపోవడం అతని అభిమానులని బాగా నిరాశకు గురి చేసింది.. అతను ఉండి ఉంటే కచ్చితంగా తమ టీమ్ చివరి వరకూ వెళ్లేది అని భావించారు… ఇంతకీ అతను ఎవరో కాదు
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేశ్ రైనా…కొన్ని కారణాల వల్ల ఆయన దుబాయ్ నుంచి ఇండియా వచ్చేశారు.
ఆయన టోర్నీ నుంచి బయటకు రావడంతో ఎన్నో పుకార్లు వచ్చినా ఇన్నాళ్లూ నోరు మెదపని రైనా.. తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మనం సంతోషంగా లేకపోతే వెనక్కి వచ్చేయాలనేది నా ఆలోచన. నేను ఏ విషయంలోను ఎవరైనా ఇది చేయాలి అని ఒత్తిడి తీసుకురాను అని తాజాగా ఇంటర్వ్యూలో తెలిపారు.
ఐపీఎల్లో ఆడకపోవడం వల్ల తానేమీ బాధపడటం లేదని, తన పిల్లలు, కుటుంబంతో గడపడం సంతోషంగా ఉందని తెలిపాడు, అయితే 20 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా, ఈ సమయంలో నా కుటుంబం బాధలో ఉంది నా అవసరం అక్కడ ఉంది అందుకే నేను వెళ్లాల్సి వచ్చింది అని తెలిపారు రైనా.