కేటీఆర్ కు రాజమౌళి సవాల్

కేటీఆర్ కు రాజమౌళి సవాల్

0
133

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ గారికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సవాల్ విసిరాడు . రాజమౌళి ఏంటి ? కేటీఆర్ కు సవాల్ విసరడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మొక్కలు నాటడంలో భాగంగా దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి కి ఛాలెంజ్ విసిరింది మూడు మొక్కలు నాటాలని , ఆ సవాల్ ని స్వీకరించిన జక్కన్న అలియాస్ రాజమౌళి మూడు మొక్కలను నాటి మరో ముగ్గురికి ఆ సవాల్ ని విసిరాడు . ఆ ముగ్గురిలో యువ నాయకుడు కేటీఆర్ కూడా ఒకరు కావడం విశేషం .

ఇక జక్కన్న సవాల్ విసిరిన వాళ్లలో మిగతా ఇద్దరు ఎవరని అనుకుంటున్నారా ? బ్యాడ్మింటన్ క్రీడాకారుడు , కోచ్ పుల్లెల గోపీచంద్ ఒకరు కాగా మరొకరు అర్జున్ రెడ్డి చిత్రంతో ప్రభంజనం సృష్టించిన దర్శకులు సందీప్ రెడ్డి వంగా కావడం విశేషం . కవిత గారి సవాల్ స్వీకరించాను , మొక్కలు నాటాను ఇక మీరు నా సవాల్ ని స్వీకరించండి అంటూ కేటిఆర్ , పుల్లెల గోపీచంద్ , సందీప్ రెడ్డి వంగా లకు ఛాలెంజ్ విసిరాడు . ఇక వాళ్ళు ఆ సవాల్ ని ఎవరు? ఎప్పుడు? ఎలా ? స్వీకరిస్తారో చూడాలి .