సినీ నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు అని ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన రాజకీయ అడుగులు వేయడం లేదు అని తేల్చిచెప్పారు. అక్కడ ఎన్నికలు కూడా ముగిసిపోయాయి. ఇక తాజాగా రజనీకాంత్ నిన్న మక్కల్ మండ్రం నేతలతో సమావేశం జరిపి కీలక అంశాలపై చర్చించారు.
రజనీ మక్కల్ మండ్రాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే కొన్నేళ్ల క్రితం కొనసాగిన తన అభిమాన సంఘం మాదిరిగా రజనీ అభిమాన సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదైనా సేవాకార్యక్రమాలు చేస్తే ఇకపై అన్నీ దాని ద్వారానే కొనసాగుతాయి అని తెలిపారు. ఇక రాజకీయాల్లోకి వచ్చేది లేదని మరోసారి తేల్చి చెప్పారు.
కొద్ది రోజుల క్రితం ఆయన సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లి వచ్చారు. అలాగే, సినిమా షూటింగులు, కరోనా విజృంభణ కారణంగా కొంతకాలం నుంచి మక్కల్ మండ్రం నిర్వాహకులతో సమావేశం నిర్వహించలేకపోయినట్లు తెలిపారు. అయితే అభిమానులకి ఆయన రాజకీయ ప్రవేశం గురించి ఉన్న అన్ని అనుమానాలకు క్లారిటీ ఇచ్చేశారు. కొంత కాలంగా ఆయన రాజకీయంగా మళ్లీ యాక్టీవ్ అవుతున్నారు అని వార్తలు వచ్చాయి. కాని ఆయన రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చి చెప్పారు.