స్టార్ హీరోతో జతకట్టనున్న రెజినా

స్టార్ హీరోతో జతకట్టనున్న రెజినా

0
52

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా అరవింద స్వామి సినిమాలో నటించబోతుందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఆయన హీరోగా రాజపండి దర్శకత్వం వహించే సినిమాకు రెజినా అయితేనే కరెక్ట్ అని అనుకుంటున్నారట దర్శక నిర్మాతలు.

అయితే తమిళ్ లో గౌతమ్ కార్తీక్ సరసన నటించిన మిస్టర్ చంద్రమోలి సినిమా పరాజయం కావడంతో రెజినా కి మళ్ళి ఆఫర్స్ వస్తాయో, రావో అని అనుకున్నారు. కానీ సినిమాలు ప్లాప్, హిట్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసే అరవింద స్వామి ఈ సినిమాకు రెజినా అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతుందని భావిస్తున్నారట.

కాగా రెజినా తమిళ్ సినిమాతో వెండి తెరకు పరిచయామై వరుసగా మూడు సినిమాలు చేసింది. ఆ తరువాత శివ మనసులో శృతి అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మళ్ళి ఇప్పుడు తమిళ్ లో వరుసగా మూడు సిలుక్కువారుపట్టి సింగం, నెంజమ్ మారప్పతిల్లై, పార్టీ సినిమాలు చేస్తుంది. మరి వీటితో పాటు హిందీలోనూ ఒక సినిమా చేస్తున్న ఈ అమ్మడు అక్కడ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.