అతనితో డేటింగ్ చేస్తున్న – రష్మిక

అతనితో డేటింగ్ చేస్తున్న - రష్మిక

0
85

గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ ,రష్మికల నటనకు ప్రేక్షకులతోపాటు విమర్శకులు సైత౦ ఫ్లాట్ అయిన సంగతి మన అ౦దరికి తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరి నటన బాగుండడంతో ఆడియన్స్ స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యారు. ఇక గీత గోవింద్ ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా మూవీకి హైప్ తెచ్చాయనే చెప్పాలి.ఇక అయితే క్లైమాక్స్ లో వచ్చే లిప్ లాక్ సీన్ పై రష్మిక వుడ్ బీ రక్షిత్ ఫ్యాన్స్ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అదీగాక అంతకుముందు రక్షిత్ – రష్మికల ఎంగేజ్ మెంట్ బ్రేకప్ అయిందని రూమర్స్ కూడా వచ్చాయి.

తాజాగా – ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక…. ఆ రూమర్స్ పై మరోసారి క్లారిటీ ఇచ్చింది. రక్షిత్ కు తనకు మంచి అండర్ స్టాండింగ్ ఉందని ఇలాంటి రూమర్స్ పట్టించుకోమని చెప్పడ౦ విశేష౦. అయితే ఇక రక్షిత్ తో బ్రేకప్ వార్తలు విని తాను గట్టిగా నవ్వుకున్నానని రష్మిక చెప్పుకోచ్చి౦ది.తనకు గత స౦వత్సర౦ నిశ్చితార్థం జరిగిందని – అంతకుముందు ఇద్దరం ప్రేమించుకోవడం కుదరలేదని చెప్పింది. అందుకే ఎంగేజ్ మెంట్ తర్వాత కాబోయే భర్త రక్షిత్ తో డేటింగ్ చేస్తున్నానని ఆ డేటింగ్ ను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకోచ్చి౦ది. పెళ్లి ఎప్పుడనే విషయంపై క్లారిటీ లేదని చెప్పింది. విజయ్ తో లిప్ లాక్ పై ట్రోలింగ్స్ నడుస్తూనే ఉంటాయని, అయితే గతంలో కూడా ఇటువ౦టివి చాలామంది హీరోయిన్లకు ఇలా ట్రోలింగ్స్ ఎదురయ్యాయని చెప్పింది. వాటిని తాను పట్టించుకోనని – వ్యక్తిగత విషయాలకు సినిమాలతో ముడిపెట్టడ౦ సరికాదని చెప్పింది. అయితే ప్రేక్షకులు కూడా డేటింగ్ – సినిమాలను వేరుగా చూడాలని కోరింది. త్వరలోనే రక్షిత్ తో కలిసి ఓ కన్నడ సినిమా చేయబోతున్నానని మరో 3 తెలుగు సినిమాలు కూడా చేతిలో ఉన్నాయంటోంది రష్మిక.