టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డుల వేటను షురూ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన భారత వికెట్ కీపర్‌గా కీపర్ రిషబ్ పంత్ రికార్డు నెలకోల్పాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో పంత్(65 నాటౌట్) అర్ధశతకంతో రాణించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 42 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. దీంతో గతంలో మహేంద్ర సింగ్ ధోనీ(56) పేరిట ఉన్న ఈ రికార్డును తాజాగా పంత్ బ్రేక్ చేశాడు.
కాగా, 3 టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక, రేపటి(గురువారం) నుంచి టీమిండియా, విండీస్ జట్టుతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత విండీస్ గడ్డపై ఈ రెండు జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభమవుతుంది.