నేడు ఢిల్లీ క్యాపిటల్స్ సారధి, టీమిండియా డాషింగ్ ప్లేయర్ రిషభ్ పంత్ 24వ పుట్టినరోజు. దీనితో అతనికి సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్-2021లో భాగంగా ప్రస్తుతం యూఏఈలో ఉన్న పంత్..తన ఐపీఎల్ జట్టుతో పాటు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాడు.
అభిమానులు, కుటుంబ సభ్యులు, ఐపీఎల్ సహచరులతో పాటు టీమిండియా ఆటగాళ్లు, బీసీసీఐ, ఐసీసీ పంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పంత్ మున్ముందు క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విట్టర్ లో పంత్ కు విషెస్ చెబుతూ Birthday+matchaday అంటూ ట్వీట్ చేసింది.
ఈ సీజన్ ఆరంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ సారధ్య బాధ్యతలను చేపట్టిన పంత్..జట్టును సమర్ధవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. అతని సారథ్యంలో డీసీ..ఇప్పవరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. పంత్ సేన నేడు టేబుల్ టాపర్ సీఎస్‌కేతో తలపడనుంది.