టీమ్‌ఇండియా బౌలర్లపై రిషభ్ పంత్ షాకింగ్ కామెంట్స్

Rishabh Pant shocking comments on Team India bowlers

0
115

రిషభ్ పంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మన స్పిన్నర్ల కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లు గొప్పగా బౌలింగ్ చేశారని అభినందించాడు. టీమ్‌ఇండియా స్పిన్నర్ల కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లే స్థిరంగా బంతులు విసిరారని పంత్ అభిప్రాయపడ్డాడు.

శుక్రవారం జరిగిన రెండో వన్డేలో అర్ధశతకం (85) చేసినా భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం పంత్ మాట్లాడుతూ.. మన బౌలర్ల కంటే సఫారీల బౌలర్లు షంసీ, కేశవ్ మహరాజ్‌, మర్​క్రమ్ చాలా చక్కగా బౌలింగ్‌ చేశారని అభినందించాడు.

“పిచ్‌ చాలా నెమ్మదిగా ఉంది. అయితే భారత్‌ చేసిన పరుగులు సరిపోతాయని భావించా. కానీ దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా ఆడి విజయం సాధించారు. తొలి మ్యాచ్‌లో మేం ఛేదనకు దిగాం. మొదట వారు బ్యాటింగ్‌ చేసేటప్పుడు పిచ్‌ అనుకూలించింది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ స్లో అయిపోయింది. దీంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. ఇక నిన్నటి వన్డేలో మధ్య ఓవర్లలో వారు చాలా బాగా ఆడారు. మేం వికెట్లను పడగొట్టడంలో విఫలమయ్యాం. సఫారీ బౌలర్లు షంసీ, కేశవ్ మహరాజ్, మర్​క్రమ్ చాలా బాగా బౌలింగ్ చేశారు.”