టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ..కాసేపట్లో బీసీసీఐ ప్రకటించే ఛాన్స్!

0
93

టెస్ట్ కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనే దానిపై బీసీసీఐ ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. సౌతాఫ్రికా సిరీస్ తరువాత విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి టెస్ట్ కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.