చెన్నై జట్టు ఆట ఈసారి ప్రేక్షకులని ఆ టీమ్ అభిమానులని నిరుత్సాహ పరిచింది అని చెప్పాలి, ఆడిన మ్యాచుల్లో చాలా వరకూ ఓటమి రావడం చెన్నై టీమ్ అభిమానులు జీర్ణించుకలేకపోయారు, అయితే ఈ ఐపీఎల్ సీజన్లో పేలవ జట్టు ప్రదర్శన ఇదే అని విమర్శలు వచ్చాయి, యువ ఆటగాళ్లకి ఛాన్స్ ఇవ్వాలి అని కెప్టెన్ పై ప్రెజర్ వచ్చింది.
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంటూ ప్లేఆఫ్ అవకాశాలను కూడా కోల్పోయింది. ఎట్టకేలకు చెన్నై ఓ విజయాన్ని సాధించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ అపజయాల్లో విజయం వచ్చింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఇక తర్వాత బరిలోకి దిగిన చెన్నై జట్టు తమ ఆటతో నిలబడింది, అంతేకాదు ఈసారి ఆటగాడు రుతురాజ్ నిలబడ్డాడు…రుతురాజ్ గైక్వాడ్ 65 అంబటి రాయుడు 39 పరుగులు బాదారు.