భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎవరికి సాయం చేయాలి అన్నా ముందు ఉంటారు, క్రీడా రంగంలో ఆయనని ఎందరో స్పూర్తిగా తీసుకుని ఎదుగుతున్నారు, వారికి కూడా అండగా ఉంటారు సచిన్, ఇక ఆయన వరకూ ఏదైనా సాయం కావాలి అని ఎవరైనా వచ్చారు అని తెలిస్తే, వెంటనే వారికి కాదు అనకుండా చేస్తారు సాయం.
తాను క్రికెట్ ఆడే రోజుల్లో తన బ్యాట్లకు మరమ్మతులు చేసిన అష్రాఫ్ చౌదరి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యాడని తెలిసి చలించిపోయారు సచిన్.. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు, అంతేకాదు ఆయనకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు మాస్టర్ టెండుల్కర్.
అష్రాఫ్ చాచా సచిన్, విరాట్ కోహ్లీ వంటి భారత క్రికెటర్లకే కాదు, స్టీవ్ స్మిత్, క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు కూడా బ్యాట్ రిపేర్ వచ్చిందంటే ఆయనే బాగు చేస్తారు, ఇక ఆయనకు ముంబైలో ఓ దుకాణం ఉంది, పిల్లలకు ఉచితంగా కూడా ఆయన బ్యాట్లు రిపేర్ చేస్తారు..మధుమేహం, న్యూమోనియాతో బాధపడుతున్నారు ఆయన.. 12 రోజులుగా సవ్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అనే విషయం సచిన్ కు తెలిసింది, వెంటనే ఆయన ధనసాయం చేయడంతో పాటు ఆస్పత్రి బిల్ తానే కడతాను అని తెలిపారట.. అష్రాఫ్ సన్నిహితుడు ఈ విషయం తెలిపారు. ఆయనను సచిన్ పరామర్శించి వచ్చారట.