సచిన్ తెందూల్కర్ సంచలన నిర్ణయం..షాక్ లో అభిమానులు!

Sachin Tendulkar's shocking decision..fans in shock!

0
114

క్రికెట్ దేవుడిగా ఇండియన్స్ పిలుచుకునే వ్యక్తి సచిన్ తెందూల్కర్. ఆయన అభిమానులు సచిన్ ఆటను చూడడానికి ఎదురుచూస్తుంటారు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి చాలా రోజులు అవుతున్న అప్పుడప్పుడు తెందూల్కర్ ఆటను అభిమానులు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తన అభిమానులకు సచిన్ షాక్ ఇచ్చాడు.

రిటైర్మెంట్​ అయిన క్రికెటర్ల కోసం ప్రతిఏటా లెజెండ్స్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తుంటారు. ఇందులో ప్రముఖ ఆటగాళ్లు కలిసి ఆడుతుంటారు. ఇటీవల భారత జట్టును కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సచిన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది లెజెండ్స్ క్రికెట్​ లీగ్​లో ఆడకూడదని తెలిపాడు. ఈ విషయాన్ని ఎస్​ఆర్​టీ స్పోర్ట్స్ మేనేజ్​మెంట్​ సంస్థ వెల్లడించింది.

అయితే గతేడాది సీజన్​ పూర్తయిన తర్వాత యువరాజ్ సింగ్, పఠాన్ బ్రదర్స్​ తదితరులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం వల్లే ఈసారి సచిన్, ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమ్​ఇండియా లెజెండ్స్ జట్టులో యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యూసఫ్​ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ఉన్నారు.