సచిన్ కు భద్రత సిబ్బందిని తొలగించిన మహారాష్ట్ర సర్కార్ రీజన్ ఏమిటంటే

సచిన్ కు భద్రత సిబ్బందిని తొలగించిన మహారాష్ట్ర సర్కార్ రీజన్ ఏమిటంటే

0
93
Sachin

క్రికెట్ కి గాడ్ గా చెప్పుకునే భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు సెక్యూరిటీ పూర్తిగా రద్దు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది అభిమానులకు కాస్త ఆశ్చర్యం కలిగించింది. ప్రముఖులకు భద్రతా ఏర్పాట్ల సమీక్షలో భాగంగా సచిన్ కు పూర్తిగా సెక్యూరిటీని తొలగిస్తున్నట్టుగా మహారాష్ట్ర ఐపీఎస్ ఒకరు ప్రకటించారు. దీంతో అందరూ షాక్ అయ్యారు.

ఇన్నాళ్లూ సచిన్ కు ఎక్స్ కేటగిరి సెక్యూరిటీని ఇచ్చినట్టుగా చెప్పారు. అంటే సచిన్ వెంట ఇరవై నాలుగు గంటలూ ఒక కానిస్టేబుల్ ఉంటారు. ఇప్పుడు ఆ ఏర్పాటును కూడా మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆయన వెంట మూడు షిప్టుల్లో ముగ్గురు పనిచేసేవారు కాని వారిని కూడా తొలగించారు.

అయితే ఖర్చుల్లో భాగంగా ఈ నిర్ణయం తగ్గించేలా తీసుకున్నారా, మరే కోణాలైనా ఉన్నాయా అని అందరూ ఆలోచిస్తున్నారు..అయితే సచిన్ కు అవసరమైతే ఎస్కార్ట్ ను ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర పోలీసు అధికారి ప్రకటించారు. మరి దీనిపై సచిన్ ఏమంటారో చూడాలి.. సాధారణంగా సచిన్ ఎక్కడికి వెళ్లినా ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది .. అలాగే ఈవెంట్స్ కు వెళితే అక్కడ సెక్యూరిటీ ఉంటారు. సో మరి సచిన్ కూడా దీనికి ఒకే చెబుతారు అని
అంటున్నారు.