సచిన్ టెండుల్కర్ కు ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి ఇప్పటికీ సచిన్ దగ్గరే ఉందట

సచిన్ టెండుల్కర్ కు ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి ఇప్పటికీ సచిన్ దగ్గరే ఉందట

0
105

సచిన్ టెండుల్కర్ క్రికెట్ కు దేవుడు అనే చెప్పాలి, ఆయనని చూసి చాలా మంది క్రికెట్ ఆటని బాగా నేర్చుకుని ఉన్నత శ్రేణి ఆటని ఆడుతున్నారు, ఇప్పుడు ఉన్న యువ క్రికెటర్లకు ఆయనే ఓ మార్గదర్శి రోల్ మోడల్ అనే చెప్పాలి, ఇక ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో యావత్ ఇండియా కన్నీరు పెట్టింది.. మాస్టర్ ఆట ఇక చూడలేమని అందరూ భాదపడ్డారు.

2013లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు తర్వాత సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇలా 2012లోనే వన్డేలకు వీడ్కోలు పలికిన సచిన్.. 2013లో టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ముంబై ఇండియన్స్ తరఫున చివరిసారిగా ఆడాడు సచిన్…ఇదే ఆయన చివరి ఆట అని అందరూ ఎంతో ఉత్కంఠగా చూశారు.

ఇక కొహ్లీకి సచిన్ అంటే చాలా ఇష్టం, అతని ఆటని చూసి పెరిగాడు కొహ్లీ..తన అభిమాన క్రికెటర్ రిటైర్మెంట్ వేళ ఉద్వేగానికి లోనయ్యాడు భారత క్రికెట్ రథసారధి కోహ్లి. ఈ సమయంలో తన ఆరాధ్య క్రికెటర్కు పవిత్ర దారాన్ని విరాట్ గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే ఈ దారం కోహ్లికి ఎవరు ఇచ్చారో తెలుసా.. ఆయన తండ్రి ఇచ్చాడట, ఎక్కడకు వెళ్లినా తన బ్యాగులో దీనిని విరాట్ దాచుకునేవాడు…కాని సచిన్ అంటే అంత ఇష్టం కాబట్టి అతనికి ఇచ్చాడు, సచిన్ దానిని ఇప్పటికీ ఎంతో తీపి గుర్తుగా తన దగ్గర ఉంచుకున్నాడు.