సిరీస్​పై సఫారీల కన్ను..పంత్ సేనకు చావో రేవో!

0
97

సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమ్​ఇండియా నేడు మూడో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ఇండియాకు చావోరేవో కాగా సఫారీలు ముచ్చటగా మూడో మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు.

వైజాగ్‌ వేదికగా నేడు జరిగే మూడో టీ20లో.. సఫారీలతో పంత్ సేన తలపడనుంది. సమిష్టి లేమి కారణంగా ఇండియాకు విజయం ఆమడ దూరంలో ఉంది. రుతురాజ్, పంత్ పూర్తిగా విఫలవుతుండగా..ఇషాన్, శ్రేయాస్, దినేష్ కార్తీక్ పర్వాలేదనిపిస్తున్నారు. ఇక బౌలింగ్ దళం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. భువి మినహా ఏ బౌలర్ సఫారీలను అడ్డుకోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్‌లో జట్టు కూర్పులో కొన్ని మార్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ లేదా పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు.. ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ తీయని ఆవేశ్ ఖాన్ స్థానంలో.. పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ లేదా అర్ష్‌దీప్‌లో ఒకరికి స్థానం దక్కే అవకాశం ఉంది.