సమంత ఆ టాటూ ఎందుకు వేయించుకుందో తెలుసా ?

సమంత ఆ టాటూ ఎందుకు వేయించుకుందో తెలుసా ?

0
123

ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత – అక్కినేని నాగచైతన్య లు తమ చేతులపై టాటూ లు వేయించుకున్న విషయం తెలిసిందే , అయితే ఆ టాటూ లను వేయించుకోవడానికి కారణం ఇప్పుడు చెప్పింది సమంత . ఇంతకీ వాళ్లిద్దరూ చేతులపై టాటూ ని ఎందుకు వేయించుకున్నారో తెలుసా ……. మీరు ఎంత ఎత్తుకి ఎదిగినా మీరు మీలానే ఉండండి …… వాస్తవంలో బ్రతకండి ” అని గుర్తు చేయడానికట !విజయాల వల్ల గర్వం రావచ్చు ఆందుకని ఇలా చేశామని అంటోంది సమంత .

నాగచైతన్య ని ప్రేమించడం , పెళ్లి చేసుకోవడం చక చకా జరిగిపోయాయి ప్రస్తుతం ఈ ఇద్దరూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు . సమంత కు పెళ్లి అయ్యాక కెరీర్ లో చెరిగిపోని విజయాలు దక్కాయి . ముఖ్యంగా రంగస్థలం చిత్రంలో అద్భుత నటన కనబరిచే ఛాన్స్ దక్కింది . అలాగే మిగతా అన్ని చిత్రాలు కూడా విజయవంతం అయ్యాయి . ఇక ఇప్పుడేమో తమిళ చిత్రాలతో బిజీ గా ఉంది సమంత , అయితే తెలుగులో మాత్రం ఈ భామకు సినిమాలు లేవు ప్రస్తుతం .

నాగచైతన్య శైలజా రెడ్డి అల్లుడు , సవ్యసాచి చిత్రాలతో బిజీ గా ఉన్నాడు . చైతూ – సమంత కలిసి ఓ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది అయితే ఇంకా అధికారికంగా మాత్రం ధ్రువీకరించలేదు .