భారత టెన్ని స్టార్ సానియా మీర్జా క్రీడాకారిణిగా, అమ్మగా తన అనుభవాలను అంతర్జాతీయ అథ్లెట్ లతో కలిసి పంచుకోనుoది. ఈ నెల 24 న ‘సమ్మర్ ఫెస్టివల్ ఆఫ్ ఒలింపియన్, పారా ఒలింపియన్ ఆన్ లైన్ ఎక్స్‌ప్రెస్ ‘ అనే కార్యక్రమాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసి), అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ సంయుక్తంగా నిర్వహించనుంది.
విశ్వ క్రీడలు వాయిదా పడినా ..క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు తెలిపారు.మొత్తం ఐదు రోజుల పాటు ఈ ఆన్ లైన్ సమావేశం జరగనుంది.ఈ నెల 28 న శారీరక మానసిక ఆరోగ్యంపై సానియా ముచ్చటించింది.తన శిక్షణ అనుభవాలతో వీక్షకుల్లో స్ఫూర్తి నింపనున్నట్టు సానియా మీర్జా తెలిపింది.
ఇక సింగిల్స్ లో రెండు గ్రాండ్‌స్లామ్ ల విజేత నవోమీ ఒసాకా,బాస్కెట్ బాల్ ప్లేయర్ హసిమరా, స్టార్ అథ్లెట్ కొలిన్ జాక్సన్,అలీసన్ ఫెలిక్స్ తదితరులు కూడా ఈ ఆన్‌లైన్ సెషన్లో పాల్గొనున్నారు.ఈ కార్యక్రమాన్ని ఒలింపిక్ ఈ ట్యూబ్ చానల్ లో ప్రసారం చేయనున్నారు .