మహేశ్ బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లొకేషన్‌లో మహేశ్ బాబు, మహిళా డ్యాన్సర్ల బృందం కనిపిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టార్ కొరియాగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో మహేశ్ లుక్ ఆకట్టుకుంటోంది.
కాగా, సెట్‌లో తీసిన మహేశ్ ఫొటోను సంగీత దర్శకుడు తమన్ షేర్ చేశారు. స్టైలిష్ లుక్‌లో, గొడుగు పట్టుకుని కనిపించారు మహేశ్. మరో ఫొటోలో ఇదే లొకేషన్‌లో నాయిక కీర్తి సురేశ్‌తో మాట్లాడుతూ కనిపించారు మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్. ఇలా ఒకేసారి ఇన్ని సర్‌ప్రైజ్‌లు రావడం వల్ల మహేశ్ అభిమానులు ఆనందపడుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.