నార్త్ కొరియా లో సీక్రెట్ రూమ్ నెంబర్ 39 – ఇక్కడ కిమ్ ఏం చేస్తారంటే

Secret Room Number 39 in North Korea

0
78

నార్త్ కొరియా దేశం పేరు వినగానే వెంటనే మనకు కిమ్ జాంగ్ ఉన్ గుర్తు వస్తాడు. ఆయన నిర్ణయాలు అక్కడ రూల్స్ శిక్షల గురించి ప్రపంచానికి తెలిసిందే. సొంత కుటుంబ సభ్యులు తప్పు చేసినా దారుణంగా వారిని చంపేస్తాడు. తినే తిండి దగ్గర నుంచి తాగే మందు వరకు అన్ని హైబ్రాండ్స్ వాడుతూ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. కిమ్కు ఖరీదైన కార్లు, వాచీలు అంటే చాలా ఇష్టం.

బాగా లగ్జరీగా బతకాలి అని భావిస్తాడు. నార్త్ కొరియాలో ఆయన ఉండటానికి 17 ప్యాలెస్లు ఉన్నాయి. ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఏకంగా 130 డాక్టర్లతో కూడిన ఆసుపత్రి ఉంది. ఆయనకు రూమ్ నెంబర్ 39 అనేది ఉంది. అసలు ఇంతకీ ఆ రూమ్ నెంబర్ 39 ఏంటి అనేది చూద్దాం.

దీనినే బ్యూరో 39, డివిజన్ 39 అని పిలుస్తుంటారు. అంటే సెంట్రల్ కమిటీ బ్యూరో 39 ఆఫ్ ది వర్కర్స్ పార్టీ అఫ్ కొరియా అంటారు. ఈ రూమ్ను 1970 సంవత్సరంలో ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్ ప్యాంగ్యాంగ్లోని ఓ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేశారు. ఇక్కడే ఖజానా సొమ్ము అంతా ఉండేది. అంటే దేశానికి వచ్చే ఆదాయం లెక్కలు ఇక్కడ నుంచే చూస్తారు.ఇటీవల కొద్దిగా మార్పులు జరిగాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ గది ద్వారా వచ్చే ఆదాయ వనరులపై కామెంట్లు రావడంతో, రూమ్ నెంబర్ 38, రూమ్ నెంబర్ 39గా డివైడ్ చేశారు. దేశానికి వచ్చే న్యాయపరమైన ఆదాయం అంతా కూడా రూమ్ నెంబర్ 38 చూసుకుంటుంటే.. అక్రమ వ్యాపారాల నుంచి వచ్చేది రూమ్ నెంబర్ 39 చూసుకుంటుంది అని అనేక వార్తలు ప్రపంచ మీడియలో వచ్చాయి.