భారత జట్టు కెప్టెన్​గా సెహ్వాగ్..లెజెండ్స్ క్రికెట్ లీగ్ ప్రారంభం ఎప్పుడంటే?

Sehwag to captain India 'When will the Legends Cricket League start?

0
114

ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ఈ నెల 20న ప్రారంభం కానుంది. ఒమన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లలో పాల్గొనబోయే జట్ల కెప్టెన్ల పేర్లను ప్రకటించారు.

భారత ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించే మహారాజ టీమ్​కు సారథిగా వీరేంద్ర సెహ్వాగ్​ వ్యవహరించనున్నాడు. వైస్​ కెప్టెన్​గా మహ్మద్​ కైఫ్ నియమితుడయ్యాడు. కోచ్​గా ఆస్ట్రేలియన్ మాజీ ప్లేయర్​ జాన్​ బుచనన్​ను ఎంపిక చేశారు.​ టోర్నీలో ఆడబోయే మరో రెండు జట్లు.. ఆసియా లయన్స్​కు సారథిగా మిషబ్​ ఉల్​ హక్, వైస్​ కెప్టెన్​గా తిలకరత్నె దిల్షాన్​, కోచ్​గా అర్జున.. వరల్డ్​ జెయింట్స్​కు సారథిగా డారెన్​ సామీ, జాంటీ రోడ్స్​ మెంటార్​గా వ్యవహరించనున్నారు.

ఈ లీగ్​లో భారత్​ తరఫున వీరేంద్ర సెహ్వాగ్​తో పాటు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, బద్రినాథ్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, మన్​ప్రీత్ గోనీ, హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు, మునాఫ్ పటేల్, సంజయ్ బంగర్, నయన్ మోంగియా, అమిత్ భండారి ఆడనున్నారని ఇటీవలే లీగ్​ కమిషనర్​ రవిశాస్త్రి వెల్లడించారు.