పూర్తయిన సెలబ్రిటీ సూపర్ 7 లీగ్.. విజేతలుగా నిలిచిన  తిరుపతి టైగర్స్ సమీర్

-

భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతం. అందరూ ఎంతో ఆనందంగా కలిసిమెలిసి చూసే క్రీడా. ఈ క్రీడా ఎన్నో రకాలుగా రూపాంతరం చెంది ఇప్పుడు మరింతగా అందరిని అలరిస్తుంది. క్రికెట్ ఆటగాళ్లే కాదు ఈ ఆట ఎవరు ఆడిన కూడా చూడాలనిపిస్తుంది. అలా కొన్ని సంవత్సరాలుగా అనేక సార్లు సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్ జరిగాయి. వాటి ద్వారా సెలెబ్రిటీలు క్రికెట్ అభిమానులను ఎంతో అలరించారు. టీవీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలు ఈ లీగ్స్ లో పాల్గొని ఎంటర్టైన్ చేయగా తాజాగా సెలబ్రిటీ సూపర్ 7 పేరుతో ఓ లీగ్ ని నిర్వహించారు.

- Advertisement -

టీవీ, సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ లీగ్ లో పాల్గొన్నారు. బృహస్పతి టెక్నాలజీస్, బృహస్పతి  ఎంటర్టైన్మెంట్ వారు ఈ లీగ్ ను నిర్వహించారు. ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తి కరంగా జరిగిన ఈ లీగ్ ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. మరెన్నో క్రికెట్ రికార్డులను కూడా అధిగమించింది. ప్రతి మ్యాచ్‌లో దాదాపు 50 మందికి పైగా టీవీ, సినిమా సెలబ్రిటీలు పాల్గొని అందరిని చీర్ చేశారు. బృహస్పతి టెక్నాలజీస్ ఎండి రాజశేఖర్, హీరో, నిర్మాత శ్రీరామ్, ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ ప్రవీణ్, హీరో, నిర్మాత నంద కిషోర్, స్పోర్ట్స్ అనలిస్ట్ కార్తీక్, నటుడు, నిర్మాత లోహిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌లు జరుగగా ఇటీవలే ఈ టోర్నీ యొక్క ఫైనల్ జరిగింది.

ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన టోర్నీ లో ఫైనల్ కూడా ఎంతో ఆసక్తిగా జరిగింది. నరాలు తేజ్ ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. చివరిగా తిరుపతి టైగర్స్ సమీర్ టీం విజేతగా నిలవగా కరీంనగర్‌ కింగ్స్ శ్రీరామ్ రన్నరప్ గా నిలిచారు. ఇక లీగ్ యొక్క మరొక సీజన్ ను కూడా ఈ జూన్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్  తరహాలో ఈ సారి భారీ స్థాయి లో దీన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...