IPL 2022: ఐపీఎల్‌లోకి షేన్ వాట్స‌న్ రీ ఎంట్రీ..కానీ ఈసారి

0
77

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజ‌రాత్ తో పాటు ల‌క్నో రెండు ఫ్రొంచైజీలు ఆడ‌బోతున్నాయి. మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి. గత సీజన్​లో​ ఛాంపియన్స్​గా నిలిచిన చెన్నై సూపర్​ కింగ్స్​, రన్నరప్​గా ఉన్న కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్‌లను ఆడాలి. దీంతో మొత్తం 70 లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవే కాకుండా ఫైనల్‌తో కలిపి నాలుగు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉంటాయి.

ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో కొత్త జెర్సీలో ఆడనుంది. ఇక తాజాగా నయా అసిస్టెంట్ కోచ్ ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే హెడ్ కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఉన్నాడు. అలాగే అసిస్టెంట్ కోచ్ గా.. ప్ర‌వీణ్ ఆమ్రే, అజిత్ అగార్క‌ర్, జెమ్స్ హోప్స్ ఉన్నారు.

ప్ర‌స్తుతం షేన్ వాట్స‌న్ కూడా కోచ్ బృందంలోకి చేరాడు. కాగ అసిస్టెంట్ కోచ్ గా నియ‌మిస్తు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్ర‌క‌టించ‌గానే… షేన్ వాట్స‌న్ స్పందించాడు. గ్రెట్ రిక్కి పాంటింగ్ నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌డానికి ఆశతో ఎదురు చూస్తున్నాన‌ని అన్నారు.

https://twitter.com/DelhiCapitals?