మెరిసిన మయాంక్..సెహ్వాగ్ రికార్డు బద్దలు

Shiny Mayank..Sehwag breaking record

0
114

వాంఖడే వేదికగా టీమ్​ఇండియా-న్యూజిలాండ్​ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి టీమ్​ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్​ (120), వృద్ధిమాన్​ సాహా(25) ఉన్నారు.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సెంచరీతో మెరిశాడు. తద్వారా మయాంక్‌ ఓ అరుదైన ఘనతను సాధించాడు. దశాబ్ద కాలంలో న్యూజిలాండ్‌పై స్వదేశంలో టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2010లో అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించాడు.

ఆ తర్వాత టీమిండియా ఓపెనర్‌ ఎవరూ కూడా సెంచరీ సాధించలేదు. తాజాగా కివీస్‌పై మయాంక్‌ సెంచరీ సాధించి ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా న్యూజిలాండ్‌పై 2014 తర్వాత సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 2014 లో ఆక్లాండ్‌ వేదికగా  కివీస్‌పై శిఖర్‌ ధావన్‌ శతకం నమోదు చేశాడు. కాగా మయాంక్‌ ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో నాలుగో సెంచరీ. ముఖ్యంగా నాలుగు సెంచరీలు కూడా స్వదేశంలో చేసినవే కావడం గమనార్హం.