ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చె నెల 12, 13 తేదీలలో జరిగబోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రొచైంజ్ లు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి మొత్తం 1214 మంది క్రికెటర్లు ఈ వేలంలో భాగం కానున్నారు.
ఇప్పటికే ఆయా జట్లు అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఈ తరుణంలో ఐపీఎల్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ చివరిదశ మ్యాచ్ లకు ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు చెందిన ఆటగాళ్లు దూరం కానున్నట్లు సమాచారం అందుతోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్ తో సిరీస్ దీనికి కారణం. మార్చి 27వ తేదీ నుంచి మే చివరి వరకు ఐపీఎల్ టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
మొత్తంగా 10 జట్టు 64 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఈ నిర్ణీత వ్యవధిలోనే ఐపీఎల్ జరిగితే ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు ఆటగాళ్లు ప్లే ఆఫ్ సమయంలోనే సొంత గుట్టకు బయలుదేరే అవకాశం ఉంది. టెస్టు చాంపియన్షిప్ ప్రాధాన్యత నేపథ్యంలో.. ఆటగాళ్లను ఈ సి బి వెనక్కి రప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా జూన్ 2వ తేదీ నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది.