కేకేఆర్ సారథిగా శ్రేయస్..స్పష్టం చేసిన యాజమాన్యం

0
99

IPL: కోల్​కతా నైట్​రైడర్స్ కెప్టెన్​గా శ్రేయస్ అయ్యర్​ను ఉంటాడని టీమ్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన చేసింది. దీనిపై శ్రేయస్ మాట్లాడుతూ..”కేకేఆర్​ సారథిగా బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నాను. వివిధ దేశాల ఆటగాళ్లు ఉండే జట్టును నడిపించడం గొప్ప అవకాశం. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ఒకే చోటుకు చేర్చడం ఐపీఎల్​ ప్రత్యేకత. నాకు ఈ అవకాశాన్నిచ్చిన కేకేఆర్ యాజమాన్యానికి ధన్యవాదాలు. సమష్టిగా రాణించి మా జట్టుకు విజయాలు అందిస్తాం’ అని అన్నాడు.