క్రీడాకారిణి స్మృతి మందాన బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

క్రీడాకారిణి స్మృతి మందాన బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

0
112

ఆమె భారత మహిళా జట్టు ఓపెనర్ , అంతేకాదు ఆమె అందాల తార కూడా, సినిమాల్లో నటించినా ఆమెకి కచ్చితంగా అవకాశాలు వస్తాయి అంటారు అందరూ.. ఇటు క్రీడల్లో రాణిస్తున్న ఆణిముత్యం అనేచెప్పాలి
ఆమె స్మృతి మందాన…అతి తక్కువ సమయంలోనే క్రికెట్ మైదానంలో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది.

భారత్ లో ఆమెకి మహిళా ఫ్యాన్స్ తో పాటు అబ్బాయిలు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆమె వయసు ఇప్పుడు 24 ఏళ్లు. 2016 లో ఐసీసీ ఉమెన్స్ టీం ఆఫ్ ది ఇయర్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఇక అందరికి దాదాపు ఆమె నవ్వు అంటే చాలా ఇష్టం.
అందుకే అభిమానులు అందరూ బ్యాటింగ్ సుందరి గా పిలుస్తుంటారు..

మరి ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి, అసలు ఇది నిజమా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు, అయితే మధ్యప్రదేశ్ కు చెందిన పలాష్ ముచ్చల్ అనే మ్యూజిక్ డైరెక్టర్ తో స్మృతి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ముచ్చల్ చాలా సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు.
బీ టౌన్ లో చాలా మంది దర్శక నిర్మాతలకు అతను బాగా తెలుసు.

అమితాబ్ బచ్చన్ నటించిన భూత్నాథ్ రిటర్న్స్ సినిమాకు కూడా ఇతనే మ్యూజిక్ అందించాడు. గతంలో అతని పాటకి సంబంధించి అప్ డేట్ ఆమె ఇచ్చింది, అయితే ఇటీవల ఇంటర్వ్యూలో ఆమెని ఆ వ్యక్తి గురించి అడిగితే ఎవరు అని అడిగింది, అయితే అంత సులువుగా ఆమె ఈ విషయం బయటపెట్టడం లేదా? లేక మంచి స్నేహమా అనేది వచ్చే రోజుల్లో క్లారిటీ రానుంది.