సౌరవ్ గంగూలీ బయోపిక్ ? అతనిలా నటించే హీరో ఎవరంటే?

సౌరవ్ గంగూలీ బయోపిక్ ? అతనిలా నటించే హీరో ఎవరంటే?

0
89

టీమిండియాకి అనేక విజయాలు తీసుకువచ్చిన కెప్టెన్లలో ఒకరు సౌరవ్ గంగూలీ, ఆయన ఆటతీరు అందరికి నచ్చుతుంది, వివాదాలు లేకుండా క్రికెట్ కెరియర్ సాగించిన ఆటగాడు, 2003లో పలు అంచనాల మధ్య ప్రపంచకప్లో అడుగుపెట్టిన భారత జట్టును, ఫైనల్కు నడిపించడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు, గంగూలీ టీమ్ అంటే ఇలా ఉంటుంది అని పలు మ్యాచుల్లో నిరూపించిన గొప్ప కెప్టెన్.

ప్రస్తుతం బీసీసీఐ చీఫ్గా ఉన్న గంగూలీ బయోపిక్ తెరకెక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
గంగూలీ బయోపిక్లో బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ లీడ్ రోల్ పోషించబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇది పక్కా అని తెలుస్తోంది, తాజాగా గంగూలీ. ఓ చాట్ షోలో మాట్లాడారు, నా బయోపిక్ హృతిక్ చేస్తే బాగుంటుంది బట్ నా శరీర సౌష్టవాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది అని అన్నారు, అయితే దీంతో అభిమానులకి హింట్ ఇచ్చినట్లు అయింది, త్వరలో ఈ సినిమా సెట్స్ పై కి వెళుతుంది అని బీ టౌన్ మీడియా కూడా భావిస్తోంది.