రెండో టెస్టులో భారత్‌ చిత్తు..సౌతాఫ్రికాను గెలిపించిన ఎల్గర్‌

0
73

జోహన్నెస్​బర్గ్​ మైదానంలో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 240 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ 96 పరుగులతో నాటౌట్​గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తెంబా బవుమా(23) అతడికి సహకారం అందించాడు. భారత బౌలర్లలో షమీ, ఠాకూర్‌, అశ్విన్‌ తలో వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సారథి ఎల్గర్ ‘ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్’గా నిలిచాడు. ​ఈ టెస్టులో భారత్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు.

భారత్ తొలి ఇన్నింగ్స్​లో 202 పరుగులకు ఆలౌటైంది. బదులుగా సౌతాఫ్రికా 229 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్​లో 266 పరుగులు చేసిన టీమ్ ఇండియా.. దక్షిణాఫ్రికా ముందు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడు మ్యాచ్​ల సిరీస్​లో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో టెస్టు కేప్ టౌన్ వేదికగా జనవరి 11 నుంచి జరగనుంది.