కొత్త వ్యాపారంలో నయనతార పెట్టుబడులు

0
107

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ చాలా మంది సినీ సెలబ్రిటీలు పలు వ్యాపారాల్లో అడుగుపెట్టడం చూస్తూనే ఉన్నాం. ఇటు సినిమా నిర్మాత‌లుగా అలాగే రియ‌ల్ ఎస్టేట్ తో పాటు ప‌లు కొత్త వ్యాపారాలు చేస్తున్నారు.తాజాగా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార కొత్త బిజినెస్ లో అడుగుపెట్టింది.
మ‌రి ఆమె ఎందులో ఇన్వెస్ట్ చేశారు అనేది చూస్తే?

చెన్నైకి చెందిన చాయ్ వాలే లో ఆమె పెట్టుబడి పెట్టినట్టు కోలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సంస్థకు రూ. 5 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇందులో నయన్, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ ల పెట్టుబడులు కూడా ఉన్నాయని టాక్ న‌డుస్తోంది.

ఈ సంస్థ దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫంక్షనల్ స్టోర్లను తీసుకొస్తోంది. మంచి బ్రాండింగ్ తో దూసుకుపోతోంది. ఈ సంవ‌త్స‌రం 35 స్టోర్లను తెరవాలనేది కంపెనీ టార్గెట్ . మొత్తానికి న‌య‌న‌తార ఇందులో పెట్టుబ‌డి పెట్టారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి.