అల్లు వారి అబ్బాయి పై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్

అల్లు వారి అబ్బాయి పై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్

0
118

నటి శ్రీ రెడ్డి తాజాగా అల్లు కాంపౌండ్ పై మరో బాంబ్ వేసి సంచలనం సృష్టించింది . అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ ని ఈసారి టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి . బాబీ …… నువ్ నన్ను బాగా మిస్ అవుతున్నావ్ ఆ విషయం నాకు తెలుసు , మనిద్దరం కలిసి నోవాటెల్ హోటల్ లో …… పబ్ లో ఎలా ఎంజాయ్ చేసామో అక్కడ వస్తువుని అడిగినా చెబుతాయి . అయితే నేను గతకొంత కాలంగా హై లైఫ్ పబ్ కి నేను రావడం లేదు , దాంతో నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను త్వరలోనే కలుద్దాం బాబీ …… అంటూ అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు అర్జున్ అన్నయ్య తనకు ఎంత దగ్గరో చెప్పి షాక్ ఇచ్చింది .

కాస్టింగ్ కౌచ్ వివాదాన్ని తట్టిలేపిన ఈ భామ గత నాలుగు నెలలుగా రచ్చ రచ్చ చేస్తూనే ఉంది . ఇన్నాళ్లు తెలుగువాళ్ళ మీద పడిన శ్రీ రెడ్డి తాజాగా తమిళ వాళ్ళని టార్గెట్ చేస్తోంది అయితే పనిలో పనిగా అల్లు అరవింద్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది . అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ తనతో తిరిగాడని , చాలా క్లోజ్ అని సెలవిస్తోంది శ్రీ రెడ్డి . అయితే శ్రీ రెడ్డి చేసిన పోస్ట్ గురించి అల్లు బాబీ స్పందించే అవకాశం తక్కువే ! ఎందుకంటే ఆ విషయం గురించి మాట్లాడితే మళ్ళీ రచ్చ మొదలవుతుంది కాబట్టి అల్లు కాంపౌండ్ సైలెంట్ అవుతుందేమో !