బ్రేకింగ్: శ్రీకాంతా చారి తండ్రి మిస్సింగ్..

0
94

తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి తండ్రి వెంకటాచారి అదృశ్యం కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 1న వెంకటాచారి పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ తిరిగి రాలేదని ఆయన భార్య శంకరమ్మ హయత్ నగర్ పోలీసులను ఫిర్యాదు చేసింది. శంకరమ్మ  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వద్ద తన భర్త ఆశ్రయం పొందుతూ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు శంకరమ్మ ఇచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.