IPL 2022: ఐపీఎల్ కు స్టార్ ప్లేయర్ దూరం..కారణం ఇదే!

0
79

గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగిన ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ ఈ సీజన్​కు కూడా అందుబాటులో ఉండట్లేదని సమాచారం. ఇటీవలే జరిగిన యాషెస్ సిరీస్​లో ఆస్ట్రేలియాపై ఘోరంగా ఓడిపోయింది ఇంగ్లీష్​ జట్టు. ఈ నేపథ్యంలో జట్టుకు అండగా ఉండేందుకు స్టోక్స్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కష్టాల్లో ఉన్న తన జట్టు కోసం ఈ ఏడాది ఐపీఎల్​ మెగా వేలంలో పాల్గొనట్లేదని తెలిపాడు రూట్​. అతడు నిర్ణయం ప్రకటించిన కొద్దిసేపటిలోనే స్టోక్స్​ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన యాషెస్​ సిరీస్​లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది ఇంగ్లాండ్​. 4-0 తేడాతో సిరీస్​ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలోనే తమ జట్టుకు అండగా ఉండాలని స్టోక్స్​, రూట్​ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు ఐపీఎల్​లో ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. అహ్మదాబాద్​, లఖ్​నవూ ప్రాంఛైజీలకు బీసీసీఐ ఇప్పటికే అధికారిక అనుమతులు ఇచ్చింది. కరోనా కేసులు తగ్గితే టోర్నీని భారత్​లోనే నిర్వహించనున్నారు. లేకపోతే విదేశాలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.